రాబోయే నాలుగు రోజుల్లో తుఫాను హెచ్చరికల నేపథ్యంలో, రైతులు అప్రమత్తంగా ఉండాలని కిర్లంపూడి ఏవో సుధామాధురి శనివారం సూచించారు. వరి కోతలను మరో వారం రోజులు వాయిదా వేయాలని ఆమె కోరారు. పొలాల్లో నీరు నిలిస్తే కాలువల ద్వారా బయటకు పంపాలని, గింజలు రంగు మారకుండా, తెగుళ్లు సోకకుండా ఉండేందుకు లీటరు నీటికి 1 గ్రా. కార్బండిజం లేదా 1 మిల్లీలీటర్ ప్రాపికొనజోల్ మందు కలిపి పిచికారీ చేయాలని తెలిపారు.