డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసాలు: సీఐ

నగరాలకే పరిమితమైన సైబర్ నేరాలు ప్రస్తుతం గ్రామాలకు విస్తరించాయని సర్పవరం సీఐ పెద్దిరాజు ఆదివారం ఆందోళన వ్యక్తం చేశారు. బోట్స్ క్లబ్‌లో జరిగిన సీనియర్ సిటిజన్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా వృద్ధులు డిజిటల్ అరెస్ట్, ఇతర సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అపరిచిత వ్యక్తులకు వ్యక్తిగత వివరాలు తెలపకూడదని, మోసపోతే వెంటనే పోలీసులను సంప్రదించాలని అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్