కాకినాడ జిల్లా ఉపాధి కార్యాలయంలో ఫిబ్రవరి 7వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి జి. శ్రీనివాసరావు తెలిపారు. పేటీఎం, జీఆర్టీ హోటల్ వంటి సంస్థలలో 110 ఖాళీలను భర్తీ చేయనున్నారు. 18 నుంచి 35 ఏళ్ల వయసు ఉండి, టెన్త్ నుంచి డిగ్రీ వరకు చదివిన అభ్యర్థులు అర్హులు. ఆసక్తి గలవారు శనివారం ఉదయం 10 గంటలకు ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు.