కాకినాడ: ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు

కాకినాడలో గురుపౌర్ణమిని గురువారం భక్తులు ఘనంగా నిర్వహించారు. కాకినాడ పెద్ద మార్కెట్ లోని శ్రీ సాయిబాబా మందిరాల్లో అర్చకులు ఉదయం మూలవిరాట్లకు వివిధ రకాల అభిషేకాలు చేసి, ప్రత్యేకంగా అలంకరించారు. అర్చనలు, హోమాలు నిర్వహించారు. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి సాయిబాబాను దర్శించుకున్నారు. ఆలయ కమిటీల ఆధ్వర్యంలో తీర్థ ప్రసాద వినియోగం, అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్