కాకినాడలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మోరంపూడి సుజాత (55) అనే మహిళ ప్రాణాలు కోల్పోయారు. సాంబమూర్తినగర్ దుర్గమ్మ గుడి వద్ద స్కూటీపై వెళ్తున్న దంపతులను వెనుక నుంచి వచ్చిన రొయ్యల లోడ్ లారీ బలంగా ఢీకొట్టింది. లారీ చక్రం సుజాత తలపై నుంచి వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో గాయపడిన భర్త సుదర్శన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్ పోలీసులకు లొంగిపోయారు.