కాకినాడ వన్‌టౌన్ పరిధిలో జరిగిన కర్రి చందు (39) హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఓల్డ్ బస్టాండ్ ప్రాంతానికి చెందిన చందును అక్రమ సంబంధం అనుమానంతో రాయితో కొట్టి హత్య చేసినట్లు విచారణలో తేలింది. ఈ కేసులో బర్నికల లక్ష్మణరావు, పంతాడి లక్ష్మణ్‌తో పాటు ఒక మైనర్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు సోమవారం వెల్లడించారు.