కాకినాడ ఎంపీ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ, తుని, పిఠాపురం, ప్రత్తిపాడు, పెద్దాపురం, సామర్లకోట, జగ్గంపేట ప్రజలను తుఫాన్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. తుఫాన్ సమయంలో విద్యుత్ స్తంభాలు, చెట్లు కూలిపోయే ప్రమాదం ఉందని, ఎవరూ బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విపత్తు పరిస్థితుల్లో అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.