మత్స్యకారులకు చిక్కిన అరుదైన చేపలు

కాకినాడకు చెందిన మత్స్యకారుల వలలకు అరుదైన కొమ్ముకోనెం, నెమలి కోనెం చేపలు భారీగా చిక్కాయి. కొమ్ము కోనెం చేపలు కేజీ రూ.180, నెమలి కోనెం చేపలు రూ.200 వరకు అమ్మారు. వీటిని ఎక్కువగా విదేశాలకు ఎగుమతి చేస్తుంటారని మత్స్యకారులు వెల్లడించారు. భారీగా చేపలు పడటంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ అరుదైన చేపల వేటతో మత్స్యకారులకు మంచి ఆదాయం లభించింది.

సంబంధిత పోస్ట్