కత్తిపూడి హైవేపై ప్రమాదం.. CCTV ఫుటేజీ

శంఖవరం మండలం కత్తిపూడి జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన సీసీ ఫుటేజీ విడుదలైంది. మలుపు తిరుగుతున్న లారీని వేగంగా వచ్చిన కంటైనర్ ఢీకొనడంతో క్షణాల్లో మంటలు చెలరేగి క్లీనర్ సజీవ దహనమయ్యాడు. తెల్లవారుజామున ప్రమాదం జరగడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్