అన్నవరం: సత్యదేవుని భక్తులకు తీపి కబురు!

అన్నవరం దేవస్థానంలో అన్నదానంలో భక్తులకు స్వామివారి ప్రసాదాన్ని సోమవారం నుంచి అందజేస్తున్నట్లు ఈవో నల్లం సూర్యచక్రధర్రావు తెలిపారు. ఇటీవల జరిగిన ట్రస్ట్ బోర్డు సమావేశంలో సభ్యుల కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. స్వామివారి కళ్యాణం రోజైన సోమవారం నుంచి ఈ విధానం అమల్లోకి తెచ్చారు. భక్తుల సౌకర్యార్థం తీసుకున్న ఈ నిర్ణయానికి ట్రస్టు బోర్డు సభ్యులు ఈవోకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్