కాకినాడ రూరల్ మండలం సర్పవరం పోస్టల్ కాలనీ, రైల్వే కాలనీలలో లో-వోల్టేజ్ సమస్య పరిష్కారం కోరుతూ ఆప్ నాయకులు కృష్ణమోహన్, సంతోష్ జిల్లా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. తరచుగా కరెంటు హెచ్చుతగ్గుల వల్ల ఏసీలు, మోటార్లు, టీవీలు కాలిపోతున్నాయని, ఫ్యాన్లు కూడా తిరగని పరిస్థితి ఏర్పడుతోందని తెలిపారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని, తక్షణ చర్యగా కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని కోరారు. కలెక్టర్ ఈ విజ్ఞప్తిని సూపరింటెండెంట్ ఇంజనీర్‌కు పంపిస్తానని హామీ ఇచ్చారు.