కొత్తపల్లి మండలం కొండేవరం శివారులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. గోదావరి కాలువ వద్ద ఆటో వెళ్తుండగా కుక్క అడ్డురావడంతో వాహనం అదుపుతప్పి కాలువలోకి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌తో పాటు ఒక మహిళ గాయపడ్డారు. గాయపడిన వారిని పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.