చేబ్రోలు సీతారామ స్వామి వారి రథోత్సవంలో కత్తిపూడి గ్రామానికి చెందిన వెంకటేశ్ అనే యువకుడు రథం కిందపడి మృతి చెందిన ఘటనపై గ్రామస్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వందల ఏళ్లుగా జరుగుతున్న రథోత్సవంలో ఇలాంటి దుర్ఘటన ఎప్పుడూ జరగలేదని, ఈ ఘటనకు ఎవరు బాధ్యత వహించాలనే దానిపై అందరిలోనూ చర్చ జరుగుతోంది. తొక్కిసలాట, తోపులాట జరిగిందా లేక రోడ్డుకు ఇరువైపులా ఉన్న వాహనాలే ప్రమాదానికి కారణమయ్యాయా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.