శిధిలావస్థకు చేరిన మురుగునీటి కాల్వ వంతెన

కాకినాడ రూరల్ పరిధిలోని పెదపూడి మండలం పెద్దాడ, గండ్రేడు గ్రామాల మధ్య ఉన్న మురుగునీటి కాలువ వంతెన ప్రమాదకరంగా మారింది. గత ప్రభుత్వ కాలంలో పాక్షికంగా దెబ్బతిన్న ఈ వంతెన ఇప్పుడు పూర్తిగా శిథిలావస్థకు చేరింది. రక్షణ గోడలు లేకపోవడంతో రాత్రి వేళల్లో వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. ఇరిగేషన్ అధికారులు స్పందించి వంతెనను పునఃనిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్