గంజాయి విక్రయిస్తున్న జిల్లా యువకుడు అరెస్ట్

కాకినాడ జిల్లా చిన్నయ్యపాలెంకు చెందిన బండి నూతన ప్రసాద్ (20) అనే యువకుడు తెలంగాణ రాష్ట్రం హన్మకొండ జిల్లా కాజీపేట మండలం కడిపికొండ బ్రిడ్జి సమీపంలో గంజాయి అమ్ముతుండగా పోలీసులు అరెస్టు చేశారు. అక్కడ అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా అతని వద్ద నుంచి కిలో గంజాయి, ఒక మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. అతడిపై NDPS చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్