కాకినాడ జిల్లాలోని కత్తిపూడి సమీపంలో రావికంపాడు జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక లారీ కంటైనర్‌ను ఢీకొనడంతో మంటలు చెలరేగి, కంటైనర్‌లోనే క్లీనర్ సజీవదహనమయ్యాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ దుర్ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.