నర్సీపట్నం పోలీసులు బుధవారం 50 కిలోల గంజాయిని రవాణా చేస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేశారు. రూరల్ CI రేవతమ్మ, కేడీపేట SI రిషికేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. పట్టుబడిన నిందితులు కాకినాడకు చెందినవారు. వీరిలో ముగ్గురిపై ఇప్పటికే వివిధ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే గంజాయి రవాణాకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలిందని CI తెలిపారు.