మాజీ ఎమ్మెల్యే వర్మ సోమవారం పిఠాపురంలో మాట్లాడుతూ, మాజీ మంత్రి కన్నబాబు రామాయణం, భారతం చెబుతారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. గతంలో వ్యవసాయ మంత్రిగా, సీఎం జగన్‌గా రాష్ట్ర అభివృద్ధికి చేసిన పని ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు జగన్ ఎప్పుడూ కూడా రాలేదని, కానీ చంద్రబాబు మాత్రం కష్టసమయంలో వెంటనే ప్రజల మధ్య ఉంటారని అన్నారు. వైసీపీ పాలనలో రైతుల ధాన్యం చెల్లింపులు ఏడాది ఆలస్యంగా జరిగాయని ఆరోపించారు.