జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గురువారం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు ఒకరోజు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. తుఫాన్ ప్రభావం అధికంగా ఉండటంతో బుధవారం కూడా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయా విద్యాసంస్థలకు సమాచారం పంపారు.