కాకినాడ: వారంతా సేఫ్!

కాజులూరు మండలం దుగ్గుదుర్రు గ్రామంలో చల్లబజ్జీలు, చట్నీ తిని ఫుడ్ పాయిజన్‌కు గురైన బాధితులంతా క్షేమంగా ఉన్నారని, ఎలాంటి ప్రాణాపాయం లేదని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరసింహ నాయక్ ఆదివారం తెలిపారు. ముందుజాగ్రత్తగా పీహెచ్సీ వద్ద 108 అంబులెన్స్ సిద్ధం చేశామన్నారు. ప్రజలు బయట ఆహారం తినేటప్పుడు తగిన జాగ్రత్తలు వహించాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్