కోటనందూరు: ఇద్దరు మహిళల అదృశ్యం.. కేసు నమోదు

కోటనందూరు మండలంలో ఇద్దరు యువతులు అదృశ్యమైనట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. భీమవరపుకోటకి చెందిన దుర్గాభవాని (23), కోటనందూరుకి చెందిన సునీత (22) కనిపించడంలేదని వారి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. వీరి ఆచూకీ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. అదృశ్యమైన వారి వివరాలు తెలిస్తే వెంటనే పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని ఎస్సై కోరారు.

సంబంధిత పోస్ట్