కాలిన గాయాలతో వ్యక్తి మృతి

పెద్దాపురప్పాడులో శనివారం వినయ్ కుమార్ (44) అనే వ్యక్తి కాలిన గాయాలతో మృతి చెందాడు. శుక్రవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుని మరణించినట్లు పోలీసులు తెలిపారు. సిగరెట్ తాగుతున్న సమయంలో మంటలు అంటుకుని ఉంటాయని మృతుడి కుమార్తె పవిత్ర ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్