గొల్లపాలెం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

దాక్షారామ-కాకినాడ రహదారిలో గొల్లపాలెం వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గండి ఏసురత్నం అనే వ్యక్తి మృతి చెందారు. ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానికులు తెలిపారు. 108 వాహనం ద్వారా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ సాయంత్రం ఆయన మరణించారు. గొల్లపాలెం ఎస్సై మోహన్ కుమార్ దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్