ముత్తానగర్ పాఠశాలలో Rtn లెనిన్ నవోదయ స్టడీ మెటీరియల్ పంపిణి

కాకినాడలోని ముత్తానగర్ ప్రాథమిక పాఠశాలలో, రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ ఎలైట్ అధ్యక్షులు శ్రీ లంకే లెనిన్ ఆర్థిక సహకారంతో నవోదయ ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతున్న 30 మంది విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి పాఠశాల యాజమాన్యం, వార్డు ప్రజల తరపున PSHM పినపోతు రామకృష్ణ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో HM KNV ప్రసాద్, ప్రెసిడెంట్ లెనిన్, నారాయణ రావు, సునీల్, న్యూట్రిషనిస్ట్ M. సిరిష, గైనకాలజిస్ట్ డాక్టర్ మంజీర డాలీ, భాస్కర్ రెడ్డి, సౌజన్య పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్