సామర్లకోట వద్ద బుధవారం జరిగిన ఆటో ప్రమాదంలో ప్రయాణిస్తున్న వారంతా మహిళలేనని పోలీసులు నిర్ధారించారు. కాకినాడ సముద్ర తీర ప్రాంతం నుంచి చేపల విక్రయం కోసం ఆటోలో వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. క్షతగాత్రులను ఉప్పాడ, అమీనాబాద్ ప్రాంతాలకు చెందిన గరికిన సింహాద్రి, వెర్రిపల్లి చిట్టెమ్మ, రామిశెట్టి నాగమణి, మేకల పోలీశ్వరి, దొడ్డి సత్యవతిగా పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.