ఉరివేసుకుని విద్యార్థి ఆత్మహత్య

విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలోని చింతలదిమ్మలో గురువారం 16 ఏళ్ల ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కాకినాడ జిల్లా కాజులూరు మండలానికి చెందిన ఈ విద్యార్థి కొత్తవలసలోని ఓ అకాడమీలో చదువుతున్నాడు. బుధవారం స్నేహితులు పిలిచినా, తలనొప్పిగా ఉందని గదిలోనే ఉండిపోయాడు. తర్వాత తోటి విద్యార్థులు వచ్చి చూడగా, అతను ఉరివేసుకుని కనిపించాడు. కళాశాల యాజమాన్యం ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్