క్యాన్సర్‌తో పోరాడి పదో తరగతిలో విజయం సాధించిన విద్యార్థి

కాకినాడ రూరల్ పగడాలపేట హైస్కూల్ విద్యార్థి ఎం. పవన్ కుమార్ పదో తరగతి ఫలితాల్లో అద్భుత విజయం సాధించాడు. చిన్న వయసులోనే క్యాన్సర్ బారిన పడి, తీవ్ర నొప్పులతో బాధపడుతున్నా, కేవలం రెండు నెలల చదువుతోనే పరీక్షలు రాసి ఉత్తీర్ణుడయ్యాడు. మృత్యువుతో పోరాడుతూ అతను చూపిన ధైర్యం, మనోనిబ్బరం నేటి సమాజానికి ఆదర్శమని స్థానికులు, ఉపాధ్యాయులు ప్రశంసిస్తున్నారు.

సంబంధిత పోస్ట్