సముద్రపు కెరటాల తాకిడికి ఉప్పాడ గ్రామం క్రమంగా సముద్రంలో కలిసిపోతోంది, ఇళ్లు కూలిపోతున్నాయి. అయితే, స్థానిక పాత మార్కెట్ సమీపంలోని ఒక పురాతన బావి మాత్రం కెరటాల ధాటికి తట్టుకుని నిలబడటం విశేషం. మట్టి కొట్టుకుపోయినా పైకి స్పష్టంగా కనిపిస్తున్న ఈ బావి చుట్టూ గతంలో అనేక దేవాలయాలు ఉండేవని స్థానికులు చెబుతున్నారు. ఎన్ని కెరటాలు తాకినా ఈ బావి చెక్కుచెదరకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.