కరపలోని కాశీవారాహి అమ్మవారి విగ్రహానికి ఆదివారం ఉదయం చెమటలు పట్టాయన్న వార్తతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. ఈ అసాధారణ సంఘటనతో అర్చకుడు సుబ్బన్న ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ధర్మకర్త చిక్కాల దొరబాబు పర్యవేక్షణలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించారు. గ్రామస్థులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని, హారతులు ఇస్తూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. అమ్మవారి మహిమ వల్లే ఇలా జరిగిందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు.