కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం కత్తిపూడి వద్ద బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక కూలీ మృతి చెందగా, మరో 12 మంది గాయపడ్డారు. శ్రీరాంపురం గ్రామానికి చెందిన 14 మంది కూలీలు ఆటోలో ధర్మవరం వెళ్తుండగా, పిఠాపురం నుంచి వస్తున్న టిప్పర్ ఆటోను ఢీకొట్టింది. మృతుడు పితాని కామరాజు(65)గా గుర్తించారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. అన్నవరం ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.