విద్యుత్ రంగంపై వాయుగుండం ఎఫెక్ట్

పెదపూడి మండలం గొల్లలమామిడాడ విద్యుత్ సబ్ స్టేషన్ నుండి పెదపూడి గ్రామానికి వెళుతున్న 11 కెవి విద్యుత్ తీగలపై ప్రస్తుత వాయుగుండం ప్రభావంతో వస్తున్న ఈదురుగాళ్లకు చెట్లు విరిగిపడటం వలన గురువారం అర్ధరాత్రి నుండి విద్యుత్ అంతరాయం ఏర్పడింది. పాక్షికంగా దెబ్బతిన్న విద్యుత్ తీగలను సరిచేసి, నిలిచిన సేవలను పునరుద్ధరించేందుకు తమ సిబ్బంది కృషి చేస్తున్నట్లు విద్యుత్ శాఖ AE gvv సత్యనారాయణ తెలియజేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕