రాజమండ్రి నుంచి కాకినాడకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో బుధవారం నగల చోరీ కలకలం సృష్టించింది. కాకినాడ ప్రభుత్వాసుపత్రికి వెళ్తున్న వృద్ధురాలి నగలను గుర్తుతెలియని వ్యక్తి అపహరించాడు. అనుమానం వచ్చిన ప్రయాణికులు సామర్లకోట ఫ్లైఓవర్ సమీపంలో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా, చోరీకి గురైన నగలు లభించాయి. దీంతో ప్రయాణికులు అతడిని పట్టుకుని సామర్లకోట ట్రాఫిక్ ఎస్సై గరగారావుకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.