కాకినాడ: ప్రమాదంలో వ్యక్తి స్పాట్‌డెడ్

బుధవారం పెద్దాపురం నుంచి జగ్గంపేట వెళ్లే రహదారిలో NTR అపార్ట్మెంట్స్ సమీపంలో ఎదురెదురుగా వస్తున్న ఆటో, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి వివరాలు, ప్రమాద ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. పెద్దాపురం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్