సామర్లకోట మండలం వేట్లపాలెం బాణసంచా పరిశ్రమ ప్రమాదంపై కేసు వివరాలు దైవ రహస్యాన్ని తలపిస్తున్నాయి. ఆ ప్రమాదంలో 23 మంది మృతి చెందగా, ఇంతవరకు కేసుల వివరాలు బహిర్గతం కాలేదు. ఎవరెవరిపై కేసులు నమోదు అని వివరాలను పోలీసులు కూడా ప్రకటించకపోవడం విచిత్రం. సామర్లకోట పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు చేసినప్పటికీ ఇటు డీఎస్పీ, అటు ఎస్పీ బిందు మాధవ్ కూడా కేసులో వివరాలను ఇంతవరకు ప్రకటించకపోవటం గమనార్హం.