కిర్లంపూడి మండలం రామచంద్రపురానికి చెందిన తాపీ కార్మికుడు సప్పా వీరబాబు (51) సోమవారం కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. జూన్ 27న ఒక ప్రైవేటు భవన నిర్మాణ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. అప్పటి నుంచి చికిత్స పొందుతూ మరణించినట్లు పెద్దాపురం పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మౌనిక వెల్లడించారు.