కాకినాడ పోక్సో కోర్టు జడ్జి కె. శ్రీదేవి మంగళవారం గొల్లప్రోలు ఎస్సీపేటకు చెందిన మచ్చి రామ్మోహన్‌కు రెండు పోక్సో కేసుల్లో మొత్తం 21 ఏళ్ల 3 నెలల జైలు శిక్ష, రూ. 11 వేల జరిమానా విధించారు. లైంగికదాడికి పాల్పడినట్లు బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్ఐ బి. శివకృష్ణ కేసు నమోదు చేశారు. ఈ కేసుల్లో నిందితుడికి శిక్ష పడేలా పిఠాపురం సీఐ శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఎస్ఐ రామకృష్ణ కృషి చేశారు.