కొత్తపల్లి మండలం కొత్త మూలపేట సమీపంలో ఇసుకలో ఒక వ్యక్తి మృతదేహాన్ని మంగళవారం స్థానికులు గుర్తించారు. సుమారు 40 ఏళ్ల వయసున్న మృతుడు నాలుగు రోజులుగా స్థానికంగానే తిరుగుతున్నట్లు గ్రామస్థులు తెలిపారు. మృతదేహం వివరాలు తెలియకపోవడంతో, పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రపరిచారు. ఆచూకీ తెలిసినవారు పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.