గొల్లప్రోలు మండలం ఏకే మల్లవరంలో అన్నసమారాధన అనంతరం మిగిలిన పులిహోర పంపిణీ విషయంలో నాగలక్ష్మి, వెంకటరమణల మధ్య వివాదం చోటుచేసుకుంది. ఈ వివాదం ఇరువర్గాల కుమారుల జోక్యంతో తోపులాటకు దారితీసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బాధితుల ఫిర్యాదుల మేరకు ఇరువర్గాలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.