ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం పిఠాపురం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు గొల్లప్రోలు హౌసింగ్ లేఅవుట్‌ను సందర్శించి లబ్ధిదారుల సమస్యలు తెలుసుకుంటారు. అనంతరం కాకినాడలో పోలీసు ఉన్నతాధికారులతో శాంతిభద్రతలు, పరిపాలనపై సమీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని, సాయంత్రం తిరిగి బయలుదేరనున్నారు. స్థానిక కూటమి నాయకులు, జనసేన శ్రేణులు పర్యటనకు విస్తృత ఏర్పాట్లు చేశారు.