అత్యాశ.. రూ. 12 లక్షలు పోగొట్టింది..

యు. కొత్తపల్లి మండలం గోర్స గ్రామంలో ఒక వ్యక్తి ఆన్‌లైన్ విధానంలో అధిక డబ్బు సంపాదించాలనే ఆశతో పెట్టుబడి పెట్టి రూ. 12 లక్షలు పోగొట్టుకున్నాడు. కొన్ని రోజుల క్రితం తన ఫోన్‌కు షేర్ మార్కెట్ పేరుతో వచ్చిన నకిలీ యాప్‌లో బ్యాంకు వివరాలు నమోదు చేసుకున్నాడు. శనివారం ఉదయం తన ఖాతాలో డబ్బు లేకపోవడంతో మోసపోయినట్లు తెలుసుకుని, యు. కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటేష్ తెలిపారు.

సంబంధిత పోస్ట్