చెందుర్తిలో మైనర్ బాలిక అదృశ్యం.. కేసు నమోదు

గొల్లప్రోలు మండలంలోని చెందుర్తి ఈబీసీ కాలనీకి చెందిన 17 ఏళ్ల మైనర్ బాలిక జూన్ 23 రాత్రి అదృశ్యమైంది. కుటుంబ సభ్యులకు చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయిన బాలిక ఆచూకీ కోసం బంధువులు గాలించినా ఫలితం లేకపోయింది. దీంతో బాలిక తల్లి ఫిర్యాదు మేరకు గొల్లప్రోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాలిక ఆచూకీ తెలిసిన వారు సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్