చేబ్రోలు గ్రామంలో బాల్య వివాహం అడ్డుకున్న అధికారులు

గొల్లప్రోలు మండలంలోని చేబ్రోలు గ్రామంలో 15 ఏళ్ల బాలికకు జరగనున్న బాల్య వివాహాన్ని అధికారులు అడ్డుకున్నారు. బాల్య వివాహ నిర్మూలన అధికారులు బాలిక ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. బాల్య వివాహ నిరోధక చట్టం 2006, పోక్సో చట్టాలపై అవగాహన కల్పించి, చట్టపరమైన చర్యలు మరియు నష్టాలను వివరించారు. దీంతో బాలిక కుటుంబం వివాహాన్ని నిలిపివేయడానికి అంగీకరించి, అధికారులకు లిఖిత పూర్వక హామీ ఇచ్చింది. ఈ కార్యక్రమంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం కౌన్సిలర్ బి. దుర్గారాణి, స్పెషల్ ఆఫీసర్ సి. హెచ్. వెంకటేశ్వరరావు తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్