పేదల ఆకలి తీర్చేందుకు ఉప్పాడలో నిర్మించిన అన్న క్యాంటీన్ భవనం ఎప్పుడెప్పుడు తెరుచుకుంటుందా అని స్థానికులు ఆశగా ఎదురుచూస్తున్నారు. దీర్ఘకాలం సాగిన భవన నిర్మాణం పూర్తి కావడంతో, పేదలు అధికంగా ఉండే ఈ ప్రాంతంలో క్యాంటీన్ సేవలు తక్షణమే అందుబాటులోకి రావాలని కోరుతున్నారు. ఉప ముఖ్యమంత్రి చేతుల మీదుగా దీనిని ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తుండటంతో, ఆయన రాక కోసం వేచి చూస్తున్నారు.