కలుషిత ఆహారం తిని 11 మంది ఆసుపత్రిలో చేరిక

కాకినాడ జిల్లా రౌతులపూడి సామాజిక ఆస్పత్రిలో సోమవారం మధ్యాహ్నం జ్వరం, కడుపునొప్పి లక్షణాలతో 11 మంది చేరారు. కలుషిత ఆహారం తినడం వల్లే వారంతా అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, మెరుగైన వైద్యం అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. వీరంతా ఉప్పంపాలెం గ్రామ శివారులోని ఓ క్రషర్ లో పనిచేస్తూ అక్కడే నివాసం ఉంటున్న వీరంతా ఝార్ఖండ్, పశ్చిమ బంగాల్, బీహార్ రాష్ట్రాలకు చెందిన వారు.

సంబంధిత పోస్ట్