ఏలేశ్వరంలో వైసీపీకి గట్టి షాక్.. టిడిపిలోకి చేరికలు

ఏలేశ్వరం మండలం లింగంపర్తిలో వైసీపీ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ఎంపీటీసీ గాడు రాఘవ, మాజీ డైరెక్టర్ కాళ్ల త్రిమూర్తులు, బోను రాంబాబుల నేతృత్వంలో సుమారు 100 మంది వైసీపీ కార్యకర్తలు శుక్రవారం సాయంత్రం తమ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం, ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ సమక్షంలో వీరంతా టీడీపీ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే సత్యప్రభ వారికి టీడీపీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్