పుట్టినరోజు సందర్భంగా కుటుంబంతో కలిసి స్వామివారిని దర్శించుకోవడానికి మంగళవారం అన్నవరం వచ్చిన భక్తుడు బుచ్చిబాబు (60) గుండెపోటుతో మృతి చెందారు. ఆలయం నుంచి బయటకు వస్తుండగా పడమర రాజగోపురం వద్ద అపస్మారక స్థితిలోకి వెళ్లారు. సీపీఆర్ చేసినా, దేవస్థానం ఆసుపత్రికి తరలించినా వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.