కాకినాడ జిల్లా అన్నవరం సమీపంలో పోలీసులు సుమారు రూ. 50 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్న గంజాయిని గుర్తించి, ఒక కారును సీజ్ చేసి, ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా చేపట్టిన నిఘాతో ఈ పట్టివేత జరిగినట్లు పెద్దాపురం డీఎస్పీ ఏబీజీ తిలక్ తెలిపారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు హెచ్చరించారు.