ఎల్లో మీడియా అసత్య ప్రచారాలుపై దాడిశెట్టి రాజా ఆగ్రహం

మాజీ మంత్రి దాడిశెట్టి రాజా తనపై ఎల్లో మీడియా తప్పుడు కథనాలు ప్రచారం చేస్తోందని మంగళవారం తునిలో మండిపడ్డారు. తన వద్ద పనిచేసిన గన్మెన్‌కు సంబంధించిన వ్యక్తిగత వివాదాలను తనకు అన్వయించడం తప్పుదారి పట్టించే చర్య అని, ప్రస్తుతం ఆ గన్మెన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వద్ద పనిచేస్తున్నారని తెలిపారు. రాజకీయంగా ఎదుర్కోలేకే ఇలాంటి ప్రచారాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. వాస్తవాలకు విరుద్ధంగా వస్తున్న వార్తలను ఖండిస్తున్నానని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్