తునిలో దీపావళి సందడి: 42 బాణసంచా షాపులు, భద్రతా సూచనలు జారీ

కాకినాడ జిల్లా తుని పట్టణంలో దీపావళి పండుగ సందడి ప్రారంభమైంది. స్థానిక రాజా క్రీడా మైదానంలో ఫైర్, పోలీస్, రెవిన్యూ శాఖల అనుమతులతో 42 బాణసంచా సామగ్రి దుకాణాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే కొనుగోలుదారులతో దుకాణాలు కిటకిటలాడుతున్నాయి, అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. బాణసంచా కాల్చేటప్పుడు భద్రతా నియమాలను పాటించాలని, పిల్లలు పెద్దల పర్యవేక్షణలో మాత్రమే కాల్చాలని, అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తుని పట్టణ సీఐ గీతా రామకృష్ణ సూచించారు.

సంబంధిత పోస్ట్