మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని, తన ఆరోగ్యంపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. వైద్య పరీక్షల కోసం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి వచ్చిన ఆయన, వైద్యుల సూచన మేరకు గుండెకు స్టెంట్ వేయించుకున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వైద్యుల నిరంతర పర్యవేక్షణలో తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని, త్వరలోనే ప్రజలను నేరుగా కలుస్తానని ఆయన వెల్లడించారు.